జనసేన సభ వద్ద ఉద్రిక్తత.. ఆ పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న సెక్యూరిటీ

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా(Kakinada District) పిఠాపురం(Pithapuram) మండలంలోని చిత్రాడలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

జనసేన సభ వద్ద ఉద్రిక్తత.. ఆ పార్టీ ఎమ్మెల్యేను అడ్డుకున్న సెక్యూరిటీ
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా(Kakinada District) పిఠాపురం(Pithapuram) మండలంలోని చిత్రాడలో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి జనసైనికులు తరలిరావడంతో పిఠాపురం జనసంద్రంగా మారింది. ఆరు చోట్ల పార్కింగ్ ప్రాంగణాలు, నాలుగు చోట్ల భోజన వసతులు, ఎక్కడికక్కడ చలివేంద్రాలు, ఏడు చోట్ల వైద్య శిబిరాలు, 14 అంబులెన్స్‌లు సిద్ధం చేశారు.

1700 మంది పోలీసులు, 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేశారు. జనసేన గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న జనసేన మొదటి సభ కావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఎమ్మెల్యేలు సభ వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సభ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.

సభ వద్దకు వచ్చిన పోలవరం జనసేన ఎమ్మెల్యే(Janasena) చిర్రి బాలరాజు(Chirri balaraju) డొక్కా సీతమ్మ ద్వారం నుంచి వెళ్లాలని ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది బాలరాజును అడ్డుకున్నారని సమాచారం. డొక్కా సీతమ్మ ద్వారం నుంచి VIPలు, VVIPలె వెళతారని చెప్పి.. రాజువారి ద్వారం నుంచి వెళ్లాలంటూ ఎమ్మెల్యే బాలరాజుకు సెక్యూరిటీ సిబ్బంది సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే.. తాను ఎమ్మెల్యేను అని తాను ఆ ద్వారం నుంచే వెళ్తానంటూ చెప్పారు. ఈ క్రమంలో ఆయన అనుచరులు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగి, బారికేడ్లను తోసుకుని లోపలికి వెళ్లినట్లు తెలుస్తోంది.

Next Story