- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బేగంపేట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత.. జగన్ అభిమానులపై లాఠీ ఛార్జ్
అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చాడు. ఈ మేరకు తన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ముందస్తుగానే పిలుపునివ్వడంతో బేగంపేట విమానాశ్రయం వద్దకు వందల సంఖ్యలో వైసీపీ నేతలు, జగన్ అభిమానులు చేరుకున్నారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే జగన్ విమానాశ్రయానికి చేరుకోగానే బారికేడ్లను దాటుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గన్‌ను స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన వైసీపీ కార్యకర్తలు „సీఎం.. సీఎం“ అంటూ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అభిమానులు ముందుకు సాగేందుకు ప్రయత్నించడంతో పోలీసులతో తోపులాట చోటుచేసుకుంది. గుంపును నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌కి దిగడంతో అక్కడి వాతావరణం వేడెక్కింది. పరిస్థితిని అదుపులోకి తీసుకున్న తర్వాత జగన్ బేగంపేట నుంచి నేరుగా నాంపల్లి ఏసీబీ కోర్టుకి బయలుదేరారు. కాసేపట్లో జగన్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరవనున్నారు. అక్రమాస్తుల కేసులో విచారణకు ఈసారి ప్రత్యక్ష విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, కోర్టు వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సీబీఐ కోర్టు గేట్‌ను పూర్తిగా మూసివేసి, కేవలం న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. జగన్ రాకతో నాంపల్లి పరిసరాలన్ని పోలీసులు ముట్టడి చేసి, ఉద్రిక్తతలు నివారించేందుకు అదనపు బందోబస్తు మోహరిచారు.






