తెనాలి : మహీంద్ర కాలనీలో పోలీసుల తనిఖీలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-28 03:08:22  IST  )

ఇటీవలే కాలనీలో భారీగా బంగారం, వెండి, నగదు పట్టుబడిన క్రమంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెనాలి : మహీంద్ర కాలనీలో పోలీసుల తనిఖీలు
X

దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు జిల్లాలోని తెనాలిలో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజామునే భారీ ఎత్తున పోలీసులు మహీంద్ర కాలనీకి చేరుకున్నారు. పలు ఇళ్లలో తనిఖీలను చేపట్టారు. అయితే ఇటీవలే ఓ సామాన్య మహిళకు చెందిన రేకుల షెడ్ల ఇంటిలో పోలీసులు సోదాలు జరిపారు. ఆమె వద్ద 3 బంగారు బిస్కట్లు, 10 కేజీల వెండి, రూ.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి తన అల్లుడు తెచ్చి ఇచ్చినట్లు సదరు మహిళ విచారణలో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేవలం ఆమె నివాసంలోనే ఇలా ఉన్నాయా లేక ఇతరుల ఇండ్లలో కూడా ఉన్నాయా అనే అనుమానంతో పోలీసులు తెల్లవారుజాము నుంచి తనిఖీలను చేపట్టారు. వీటి వెనుక రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ ప్రమేయం ఉంటుందేమోననే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలోనే దర్యాప్తును చేపట్టారు.

Next Story