కొలంబోలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు.. అధికారులకు నారా లోకేశ్ కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

కొలంబోలో చిక్కుకున్న తెలుగువారిని రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపట్టారు.

కొలంబోలో చిక్కుకున్న తెలుగు ప్రయాణికులు.. అధికారులకు నారా లోకేశ్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొలంబోలో చిక్కుకున్న తెలుగువారిని రాష్ట్రానికి రప్పించేందుకు మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపట్టారు. ఏడురోజుల పర్యటన నిమిత్తం 25 మంది తెలుగు ప్రజలు ఇటీవల శ్రీలంక వెళ్లారు. తెనాలి, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖ నగరాల నుంచి శ్రీలంకకు వెళ్లిన వారంతా.. తుపాను కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మంత్రి లోకేశ్ కు తెలిపారు. వాతావరణం అనుకూలించకపోవడంతో తాము తిరిగి రావాల్సిన ఫ్లైట్ ను వేరే ఎయిర్ పోర్ట్ వద్ద ల్యాండ్ చేశారన్నారు. ఎంతసేపటికీ వెదర్ అనుకూలించకపోవడంతో తమకు వేరే ఏర్పాట్లు చేస్తామన్నారన్నారు. కానీ తమ తిరిగి భారత్ కు పంపేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు. తమను భారత్ కు తీసుకురావాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేయగా.. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ ఆందోళనకరమైన పరిస్థితిని తాను గమనించానని, తన కార్యాలయం అధికారులు వెంటనే కొలంబో, చెన్నై అధికారులతో మాట్లాడి అక్కడ చిక్కుకున్న తెలుగు వారికి అన్ని సహాయాలను అందజేసి, సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని ఆదేశించారు. కొలంబోలో చిక్కుకున్న ప్రయాణికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు.

Next Story