- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరులో టీడీపీ మహానాడు.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లాలోని కిసాన్ సెజ్ వేదికగా ఈ నెల 13 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక 'మహానాడు' కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ భారీ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు....

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District)లోని కిసాన్ సెజ్(Kisan Sez) వేదికగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) ప్రతిష్టాత్మక 'మహానాడు'(Mahanadu) కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ భారీ ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రతినిధులకు, వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. మహానాడు షెడ్యూల్ ప్రకారం మొదటి రెండు రోజుల పాటు పార్టీ డెలిగేట్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. సమావేశాల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ తీర్మానాలపై కూలంకషంగా చర్చించనున్నారని చెప్పారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ రెండు రోజుల చర్చలు అత్యంత కీలకంగా మారనున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
మూడో రోజున....
ఇక మూడో రోజున నిర్వహించే భారీ బహిరంగ సభకు సుమారు 7 లక్షల మంది ప్రజలు హాజరవుతారయ్యే అవకాశం ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు. ఇంత పెద్ద ఎత్తున జనం తరలివస్తుండటంతో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కిసాన్ సెజ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు.






