- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కార్యకర్త కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ
శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త (TDP) కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది.

దిశ, వెబ్ డెస్క్ : శ్రీకాకుళం జిల్లాలోని పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త (TDP) కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా అందజేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సంతకంతో కూడిన భీమా చెల్లింపు సమాచార లేఖను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu) బాధిత కుటుంబానికి శనివారం స్వయంగా అందజేశారు. దురదృష్టకర తొక్కిసలాటలో మృతి చెందిన టెక్కలి నియోజకవర్గం బూరగం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎదురి చిన్నమ్మ కుటుంబానికి లేఖను మంత్రి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విషాద సమయంలో బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. పార్టీకి కట్టుబడి పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందడానికి ఇదొక నిదర్శనమని తెలిపారు.






