శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ గవర్నర్ శివ్‌ ప్రతాప్‌ శుక్లా దంపతులు

by Kema Shiva Kumar |

తెలంగాణ గవర్నర్ శివ్‌ ప్రతాప్‌ శుక్లా దంపతులు శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు.

శ్రీశైలం మల్లన్న సేవలో తెలంగాణ గవర్నర్ శివ్‌ ప్రతాప్‌ శుక్లా దంపతులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గవర్నర్ శివ్‌ ప్రతాప్‌ శుక్లా (Shiv Pratap Shukla) దంపతులు ఇవాళ శ్రీశైల (Srisailam) క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్ దంపతులకు శ్రీశైలం ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో అధికారులు వారిని దర్శనానికి తీసుకెళ్లారు. దర్శనంలో భాగంగా గవర్నర్ దంపతులు ఆలయంలో స్వామివారికి భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన పూజలోనూ పాల్గొన్నారు. దర్శనం తర్వాత ఆలయ ఈవో గవర్నర్ దంపతులకు స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు. అలాగే వారిని శేషవస్త్రంతో సత్కరించి, ఆలయ జ్ఞాపికను బహుకరించారు.

Next Story