Flash: తిరుమల క్యూలైన్లో పాము కలకలం.. భక్తురాలికి కాటు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-23 03:21:55  IST  )

తిరుమల క్యూలైన్లో పాముకలకలం రేగింది. ఓ భక్తురాలిని కాటు వేయడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

Flash: తిరుమల క్యూలైన్లో పాము కలకలం.. భక్తురాలికి కాటు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వెళ్లే తిరుమలలో పాము కలకలం రేపింది. క్యూలైన్లో నిల్చున్న భక్తుల వద్దకు వచ్చిన పాము.. తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన భక్తురాలిని కాటువేసింది. రూ.300 క్యూలైన్లో ఉన్న మౌనిక(27)ను పాము కాటు వేయడంతో.. టీటీడీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటోందని టీటీడీ వెల్లడించింది. కాగా.. క్యూలైన్లోకి పాము రావడంతో భక్తులు హడలిపోయారు.

కాగా.. సోమవారం ఉదయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనార్థం వేచిఉండగా.. టోకెన్లు లేనివారికి 15 గంటలు, సర్వదర్శనం దివ్యదర్శనం టోకెన్లు ున్నవారికి 4-6 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. నిన్న (సోమవారం) 76,506 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 28,049 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు సమకూరింది.

Next Story