- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో ప్రమాదకర స్థాయిలో టీనేజీ ప్రెగ్నెన్సీలు.. దీనివల్ల నష్టాలేంటి?
ఆంధ్రప్రదేశ్ లో టీనేజీ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో టీనేజీ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో 2025-26 సంవత్సరానికి నమోదైన గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సగటున 8.8 శాతం మంది టీనేజీ యువతులు ప్రెగ్నెంట్ అవుతున్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదైనట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూల్ జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12 శాతం కంటే ఎక్కువ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవ్వడం గమనార్హం. ఏలూరు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో 10-12 శాతం వరకూ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరి, తూర్పు గోదావరి, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో 8-10 శాతం ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. ఒక్క విశాఖలో మాత్రం అత్యల్పంగా 3.98 శాతం టీనేజీ ప్రగ్నన్సీలు రికార్డవ్వగా.. మరో 9 జిల్లాల్లో మాదిరిగా టీనేజీ యువతులు గర్భాలు దాల్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దీంతో 2026-27లో కొత్త టార్గెట్ పెట్టుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు 5 శాతానికి మించకూడదని భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, యువతకు టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే బాధ్యతలను ఆశావర్కర్లకు అప్పగంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.
టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే సమస్యలేంటి ?
టీనేజ్ లో ప్రెగ్నెంట్ అయితే సుఖ ప్రసవం అవుతుందని, తల్లీ బిడ్డ క్షేమంగా ఉంటారని అనుకుంటారు కానీ.. అది అస్సలు యువతులకు మంచిది కాదంటున్నారు వైద్యులు.
16 ఏళ్ల వయసులో తల్లులైతే కాన్పు సమయంలో తల్లులు మరణించే (మెటర్నల్ మోర్టాలిటీ) అవకాశం ఉందంటున్నారు.
బిడ్డలు నెలలు నిండకముందు పుట్టే ఛాన్స్ ఎక్కువ. కడుపులోనే బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది.
పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం. తీవ్రస్థాయిలో రక్తపోటు, పుట్టిన పిల్లలు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.






