Big Breaking:సీఎం తరచూ వాడే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-16 11:32:59  IST  )

ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) జిల్లా పర్యటనలకు తరచూ వాడే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి.

Big Breaking:సీఎం తరచూ వాడే హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) జిల్లా పర్యటనలకు తరచూ వాడే హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు బయటపడ్డాయి. అయితే, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు అదే హెలికాప్టర్‌ను అధికారులు కేటాయించారు. దీంతో ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Union Minister Piyush Goyal) కృష్ణ పట్నం పర్యటన రద్దయింది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత అందులో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో కేంద్ర మంత్రి గోయల్ పర్యటనను రద్దు చేసుకున్నారు.

పీయూష్ గోయల్ తిరుచానూరు అమ్మవారి దర్శనం తర్వాత పర్యటనకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యపై కేంద్రమంత్రి భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో పర్యటన రద్దు చేసుకున్న పీయూష్ గోయల్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ ఘటనతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సీఎం, వీవీఐపీలు వాడే హెలికాప్టర్‌లో టెక్నికల్, సెక్యూరిటీ సమస్యలపై నివేదిక ఇవ్వాలని డీజీపీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story