ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం

by Gantepaka Srikanth |

ఎయిరిండియా విమాన(Air India Flight) సంస్థ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గురువారం ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎయిరిండియా విమాన(Air India Flight) సంస్థ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గురువారం ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో సమస్య ఏర్పడింది. పైలట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టులోనే ల్యాండ్ అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. నాలుగు రోజుల కిందటే.. లక్నో నుంచి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో టేకాఫ్‌ అవుతుండగా సాంకేతిక సమస్య (Technical Issue) తలెత్తిన విషయం తెలిసిందే. పైలట్‌ చివరి నిమిషంలో టేకాఫ్‌ను నిలిపివేసి.. విమానాన్ని సురక్షితంగా రన్‌వేపైకి తీసుకొచ్చారు. ఆ సమయంలో విమానంలో 151మంది ప్రయాణికులు ఉన్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికులను వేరే విమానంలో దిల్లీకి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఇలా వరుసగా విమానాల్లో్ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై ప్రమాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story