- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srikakulam: పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: పిల్లలతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లిలో జరిగింది. స్థానిక బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటన యావత్తు సోషల్ మీడియా ప్రపంచాన్ని కదిలించింది. పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ విద్యార్థులను బానిసనలుగా మార్చారు. తాను దర్జాగా కుర్చీలో కూర్చుని సెల్ ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్నారు. దీంతో అక్కడున్న వారొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో టీచర్ జులూం వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇదే వీడియో విద్యాశాఖకు చేరడంతో టీచర్ పై వెంటనే యాక్షన్ తీసుకున్నారు. సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. దెబ్బకు టీచర్ తిక్క కుదిరింది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.






