బోధించు.. సమీకరించు.. పోరాడు : మంత్రి నారాయణ

by Thanuru Gopichand |

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని (B.R.Ambedkar Death Anniversary) పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

బోధించు.. సమీకరించు.. పోరాడు : మంత్రి నారాయణ
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతిని (B.R.Ambedkar Death Anniversary) పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి ఆత్మ వంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహనీయులుగా అంబేద్కర్ ను అభివర్ణించారు. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన నాయకుడిగా కొనియాడారు. అంతేకాకుండా హక్కుల కంటే బాధ్యతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే బాబా సాహెబ్ అంబేడ్కర్ కు నిజమైన నివాళిగా వారు పేర్కొన్నారు.

వారి కోవలోనే రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కు ఎక్స్ వేదికగా తన నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లతో కలిసి ఉన్న చిత్రాన్ని ఆయన పంచుకున్నారు. చిత్రంలో బాబా సాహెబ్ ప్రతిమకు పూలను అర్పించి నమస్కారం చేస్తూ నివాళి అర్పించారు. తన ఎక్స్ ఖాతాలో.. భారత రాజ్యాంగ నిర్మాణ, ఆర్థిక వేత్త, సంఘ సంస్కర్తగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ను మంత్రి నారాయణ కొనియాడారు. ఆయనను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటరాతనాన్ని నిర్మూలించేందుకు బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి శ్లాఘనీయం అని కొనియాడారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆయన సిద్ధాంతాలు సదా అనుసరణీయమని అభిప్రాయపడ్డారు. బాబా సాహెబ్ తెలిపిన సిద్ధాంతాలను ఆచరించడం ద్వారా ఆయన కలలు గన్న నవ సమాజాన్ని సాకారం చేద్దామని ప్రజలకు మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.

Next Story