వైసీపీ ఇలాకాలో.. టీడీపీ హవా..

by Thanuru Gopichand |

ఉత్కంఠ పరిస్థితుల మధ్య పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైఎస్​ చైర్మన్​ఎన్నిక పూర్తయింది.

వైసీపీ ఇలాకాలో.. టీడీపీ హవా..
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఉత్కంఠ పరిస్థితుల మధ్య పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైఎస్​ చైర్మన్​ఎన్నిక పూర్తయింది. వైస్​చైర్మన్​గా ఉన్నం భారతిని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఆమె పట్టణంలోని 30 వార్డు కౌన్సిలర్​గా ఉన్నారు. ఈ రోజు జరిగిన కౌన్సిల్​సమావేశంలో మొత్తం 17 మంది కౌన్సిలర్లు హాజరు కాగా మొత్తం భారతికి మద్దతు తెలిపారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో ప్రకటించారు. ఈ నెల 3 వ తేదీన ఎన్నిక జరగాల్సి ఉండగా .. ఆ రోజు వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేశారు. తదుపరి రోజు కూడా వైసీపీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు ఉండగా మొత్తం వార్డులను వైసీపీ గెలుచుకుంది. 30 వార్డు కౌన్సిలర్​ భారతి గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు. ఆమెతో పాటు మరో 16 మంది కూడా టీడీపీలోకి వచ్చారు. గత రెండు సార్లు వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం ఈ రోజు సజావుగా సాగింది. హాజరైన మొత్తం 17 మంది సభ్యులు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా పాలకొండ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వైసీపీ కౌన్సిలర్లు ఇప్పటి వరకు హాజరు కాలేదు. ఇప్పటికే రెండు సార్లు పాలకొండ చైర్మన్​ ఎన్నిక వాయిదా పడింది

Next Story