నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. ఆ అంశాలపై చర్చలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-29 05:43:30  IST  )

ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం.. ఆ అంశాలపై చర్చలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం(AP Government) ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా.. వచ్చే నెల(జూలై)2వ తేదీ నుంచి పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన ఈరోజు(ఆదివారం) టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నియోజకవర్గ కన్వీనర్లు హాజరుకానున్నారు. దాదాపు నెల రోజుల పాటు కూటమి నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్న నేపథ్యంలో పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాదు.. ఈ సమావేశంలో టీడీపీ కమిటీ, కొత్త కార్యవర్గం ఇతర అంశాలపై చర్చించనున్నారు.

Next Story