TDP : సీఎం చంద్రబాబుది రహస్య పర్యటన ఏమీ కాదు: టీడీపీ ఫ్యాక్ట్ చెక్

by Ramesh Naini |

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటనపై వస్తున్న ఆరోపణలను టీడీపీ ఖండించింది

TDP : సీఎం చంద్రబాబుది రహస్య పర్యటన ఏమీ కాదు: టీడీపీ ఫ్యాక్ట్ చెక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటనపై వస్తున్న ఆరోపణలను టీడీపీ ఖండించింది. ఇది ఎలాంటి రహస్య పర్యటన కాదని, గత నాలుగు రోజులుగా మీడియాల్లో వార్తలు వస్తూనే ఉన్నాయని పార్టీ స్పష్టం చేసింది. ప్రజలకు స్పష్టంగా తెలియజేసే విధంగానే సీఎం పర్యటన కొనసాగుతోందని టీడీపీ పేర్కొంది. ఈ సందర్భంగా మంగవారం ఎక్స్ వేదికగా టీడీపీ ట్వీట్ చేస్తూ.. ‘ముందుగా.. చంద్రబాబుది రహస్య పర్యటన ఏమీ కాదు.. నాలుగు రోజులుగా మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.. రైట్ రాయల్ గా ప్రజలకు చెప్పే వెళ్తున్నారు. ఇక ఆయనకి నీ లాగా కోర్టులో చెప్పి వెళ్ళే అవసరం లేదు.. ఆయన నీలా 32 కేసులు ఉన్న 420 కాదు.. నీ లాగా పాస్ పోర్ట్ కోర్టులో ఉండదు. అందరూ నీ లాగా అనుమతులు తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు’ అని పేర్కొంది.

‘చంద్రబాబు వెళ్ళింది వ్యక్తిగత పర్యటన మీద. ఆయనకు ఒక కుటుంబం ఉంది, నీ లాగా తల్లిని, చెల్లిని గెంటేసి బ్రతికే బ్రతుకు కాదు. ఇక చంద్రబాబుది నీ లాంటి కక్కుర్తి బుద్ధి కాదు, వ్యక్తిగత పర్యటనల కోసం, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళగలిగే స్థోమత ఉంది. ఆయన్ని బంగారం లాగా చూసుకునే కొడుకు ఉన్నాడు. ఇక పెట్టుబడుల కోసం చంద్రబాబు వెళ్ళింది దావోస్ కి, దుబాయ్ కి, సింగపూర్ కి, లండన్ కి. ఆ విదేశీ పర్యటనల వల్లే గూగుల్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, రెన్యూ పవర్ వచ్చింది, MAERSK వచ్చింది.. ఇలా చెప్పుకుంటూ పోతే, అనేక విదేశీ కంపెనీలు వచ్చాయి’ అని ట్వీట్‌లో పేర్కొంది. ట్వీట్ ఇదే..

Next Story