టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన సుగవాసి బాల సుబ్రహ్మణ్యం

by Vemula.Srinu Prasad |

రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది...

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన సుగవాసి బాల సుబ్రహ్మణ్యం
X

దిశ, వెబ్ డెస్క్: రాయలసీమ(Rayalaseema)లో టీడీపీ(TDP)కి బిగ్ షాక్ తగిలింది. రాజంపేటకు చెందిన సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం(Sugavasi Balasubrahmanyam) ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌(Former Chief Minister Jagan) సమక్షంలో వైసీపీలో చేరారు. రాజంపేట టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైయస్‌ జగన్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నానని బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

కాగా సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలుపొందారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Next Story