అసెంబ్లీకి రాకుండా జీతమా..?: పల్లా కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకోవడం సరికాదని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు...

అసెంబ్లీకి రాకుండా జీతమా..?:  పల్లా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ(Assembly)కి రాకుండా జీతం తీసుకోవడం సరికాదని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(TDP state president Palla Srinivasa Rao) అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకోవడంపై ఆయన స్పందించారు. అసెంబ్లీకి రానివాళ్లను రీకాల్ చేయాలన్నారు. వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan) అసెంబ్లీకి రాకుండా 15 నెల్లల్లో మళ్లీ పాదయాత్ర చేస్తామని విడ్డూరమని ఎద్దేవా చేశారు. జగన్ ముందు ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు. కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఎన్ని కుయుక్తులు చేసినా తామంతా ధృడంగా ఉన్నామని తెలిపారు. జగన్‌కు పరిణితి లేదన్నారు. 11 సీట్లే ఇచ్చారని కాబట్టి ఇంట్లో పడుకుండానంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, 2029లో కూడా ఇదే ఫలితాలుంటాయని తెలిపారు. అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు రాకుండా జీతాలు తీసుకోవడం స్పీకర్ పరిధిలో ఉందని, త్వరలో నిర్ణయముంటుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు

Next Story