- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ మేయర్ పీఠం కూటమిదే: పల్లా శ్రీనివాస్
మేయర్ పీఠం కూటమిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దీమా వ్యక్తం చేశారు...

దిశ, వెబ్ డెస్క్: మేయర్ పీఠం కూటమిదేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్(TDP state president Palla Srinivas) దీమా వ్యక్తం చేశారు. విశాఖ మేయర్(Visakhapatnam Mayor)పై అవిశ్వాస బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా మంది వైసీపీ(Ycp) కార్పొరేటర్లు టీడీపీ(Tdp)లో జాయిన్ అయ్యేందుకు రెడీగా ఉన్నారని తెలిపారు. కానీ తాము ఎవరినీ బలవంతం చేయడం లేదని చెప్పారు. విశాఖ 74వ వార్డు వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి టీడీపీలో చేరబోతున్నట్లు ఆయన తెలిపారు. మ్యాజిక్ ఫిగర్‌కు రెండు ఓట్ల దూరంలో కూటమి ఉందని చెప్పారు. అవిశ్వాస తీర్మానంలో వైసీపీ మేయర్ ఓడిపోతారని పల్లా శ్రీనివాస్ జోస్యం చెప్పారు.
కాగా గత ఎన్నికల్లో విశాఖ మేయర్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి సేవలు అందించారు. అయితే ఆమెపై టీడీపీ కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. ఈ నెల 19 అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. దీంతో వైసీపీ, టీడీపీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. వైసీపీ కార్పొరేటర్లను కర్ణాటక, కేరళ, శ్రీలంకకు తరలించారు. టీడీపీ కార్పొరేటర్లను కౌలాలంపూర్‌కు పంపించారు. దీంతో విశాఖలో రాజకీయాలు వేడెక్కాయి.






