- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు ఆయనపై అమితమైన ప్రేమ: ఎందుకంత అంటూ సీనియర్ నేత సెటైర్లు
వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య సెటైర్లు వేశారు.

దిశ, వెబ్ డెస్క్: వివిధ కేసుల్లో వైసీపీ నేతలు(Ycp Leaders) జైలు(Jail)కు వెళుతున్నారు. కొందరిపై కేసులు నమోదు అవడంతో ముందస్తు బెయిల్(Anticipatory Bail) కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరిని విచారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) అండగా నిలుస్తున్నారు. కేసులు ఎదుర్కోవాలంటూ ధైర్యం చెబుతున్నారు. అలాగే అధికార పార్టీ నేతలపై విమర్శలు కురిపిస్తున్నారు. తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడుతున్నారు. దీంతో టీడీపీ(Tdp), జనసేన(Janasena) నేతలు కూడా జగన్‌కు, ఆ పార్టీ నాయకులు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీ, చెవిరెడ్డిని చూసి బాధేస్తుందని జగన్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. కోట్లు కొట్టేసిన వాళ్లపై ఎందుకంత ప్రేమ అని ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోయినా చెవిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయేవారని చెప్పారు. పోసానిని చూసి గుండె చెరువైందని జగన్ చెబుతున్నారని, ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు విని జగన్‌కు బాధ కలగలేదా అని వర్ల రామయ్య నిలదీశారు.






