- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహానాడు వేళ టీడీపీలో ఫుల్ జోష్: తొలిరోజే భారీగా విరాళాలు
మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేనంత జోష్ కనిపిస్తోంది. పార్టీ వార్షిక పండుగ మొదటి రోజే టీడీపీకి భారీగా విరాళాలు వచ్చిపడ్డాయి..

దిశ, వెబ్ డెస్క్: మహానాడు(Mahanadu) వేదికగా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) శ్రేణుల్లో మునుపెన్నడూ లేనంత జోష్ కనిపిస్తోంది. పార్టీ వార్షిక పండుగ మొదటి రోజే టీడీపీకి భారీగా విరాళాలు వచ్చిపడ్డాయి. వివిధ నియోజకవర్గాల నేతలు, పారిశ్రామికవేత్తలు పార్టీ ఫండ్‌కు తమ వంతుగా పెద్ద ఎత్తున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కేవలం మొదటి రోజే ఏకంగా 11 కోట్ల రూపాయల విరాళాలు సమకూరాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నేతలు ఈ చెక్కులను పార్టీకి అందజేశారు.
విరాళాల వివరాలు
ఈ విరాళాల వెల్లువలో నెల్లూరుకు చెందిన ప్రముఖ నేతలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు అందరికంటే ముందు నిలిచారు. వారు పార్టీ బలోపేతం కోసం ఏకంగా రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి తమ ఉదారతను చాటుకున్నారు. వారిని అనుసరిస్తూ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రూ. 1.50 కోట్లు, మరో ప్రముఖ నేత సానా సతీష్ రూ. 1.50 కోట్ల ఆర్థిక విరాళాన్ని సీఎం చంద్రబాబుకు అందజేశారు.
పోటీ మరి పార్టీకి అండ
వీరితో పాటు విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పార్టీ నిధికి రూ. 1 కోటి విరాళం ఇవ్వగా, టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రెండో మహానాడు కావడంతో, నేతలు పోటీ పడి మరీ పార్టీకి అండగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విరాళాల ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.






