టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. ప్రధాన నిందితుడు ఓలుపల్లి రంగా అరెస్ట్

by Kema Shiva Kumar |

గన్నవరం (Gannavaram) టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసు.. ప్రధాన నిందితుడు ఓలుపల్లి రంగా అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం (Gannavaram) టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ప్రధాన అనుచరుడు, A1గా ఉన్న ఓలుపల్లి రంగారావు (Olupalli Ranga Rao) (రంగా)ను మంగళవారం అర్ధరాత్రి సీఐడీ (CID) పోలీసులు అదుపులోకి తీసుకుని యగన్నవరం (Yagannavaram) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో రంగా ఎవరి కంటా పడకుండా ఇన్నాళ్లు తప్పించుకుని తిరిగాడు. అదేవిధంగా సత్యవర్ధన్ (Satyavardhan) కిడ్నాప్‌ వ్యవహారంలో రంగానే కీలక వ్యవహరించినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ మేరకు రంగాను మరికొద్దిసేపట్లో విజయవాడ కోర్టు (Vijayawada Court)లో హాజరు పరిచే అవకాశం ఉంది. రంగా అరెస్ట్‌తో అన్ని కేసులు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ జరగనుంది.

Next Story