‘ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే రాజకీయం ఆగాలి’.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-22 08:30:55  IST  )

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళలో పర్యటించిన విషయం తెలిసిందే.

‘ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే రాజకీయం ఆగాలి’.. టీడీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్ పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో తాజాగా సింగయ్య మృతికి సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వైఎస్ జగన్ కారు టైర్ కింద పడి వృద్ధుడు సింగయ్య మరణించినట్లు ఆ వీడియోలో స్పష్టమవుతోంది. దీనిపై టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఆ వీడియో షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పబ్లిసిటీ స్టంట్ కోసం ప్రజలు ప్రాణాలు గాల్లో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ‘‘ఒక నేత ర్యాలీకి వెళ్లి.. ఎవరికైనా ప్రాణం పోయే పరిస్థితి రాకూడదు. ప్రజల ప్రాణాలకంటే ఏ నాయకుడి ప్రచారం గొప్పది కాదు. ఈ విషాద ఘటనలపై ఎటువంటి బాధ్యత తీసుకోకుండా, ఇది సంఘటన మాత్రమే అని వ్యవహరించడం అత్యంత దుర్మార్గం’’ అని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను తాకట్టు పెట్టే ఈ రాజకీయం ఇప్పటికైనా ఆగాలి అని ఆయన సూచించారు.

Next Story