కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ ఎంపీ భేటీ

by Ramesh Naini |

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ ఎంపీ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు శుక్రవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక ప్రాముఖ్యత కలిగిన కొండవీడు కోట వారసత్వ అభివృద్ధి ప్రాజెక్ట్‌కు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ స్వదేశ దర్శన్ స్కీమ్ 2.0 కింద నిధులను త్వరితగతిన మంజూరు చేయాలని ఎంపీ కోరారు. ఈ ప్రాజెక్టు ద్వారా వారసత్వ పరిరక్షణతో పాటు పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి గణనీయమైన తోడ్పాటు లభిస్తుందని వివరించారు.

కొండవీడు కోట అభివృద్ధి..

అలాగే, ఈ అభివృద్ధి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొండవీడు కోట అభివృద్ధికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను ఆమోదించి కేంద్రానికి పంపినట్లు ఎంపీ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని నిధులను విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. దీనిపై మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

Next Story