- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో హై టెన్షన్.. భూమనకు ఫోన్ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏమన్నారంటే?
టీటీడీ ఎస్వీ గోశాలలో మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: టీటీడీ ఎస్వీ గోశాలలో మూడు నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గోవుల మరణించాయనే ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న కూటమి ప్రభుత్వం భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఎస్వీ గోశాలను సందర్శించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కూటమి నేతలు భూమన గోశాలకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ గోశాలలో ఆవుల మృతిపై కూటమి, వైసీపీ నేతల సవాళ్లు ప్రతిసవాళ్లతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్, పులివర్తి నాని సహా పలువురు భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ క్రమంలో అసత్య ఆరోపణలు సరికాదని, పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో టీటీడీ ఎస్వీ గోశాలకు రావాలని కోరారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తికి స్పందించిన భూమన.. తాను వస్తున్నట్లు బదులిచ్చారు. ఈ క్రమంలో తనకు భద్రత కల్పించాలని చెప్పారు. దీంతో గోశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే గోశాల వద్దకు వచ్చిన వైసీపీ ఎంపీ గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భూమన ఎందుకు రాలేదంటూ పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు.






