‘ఆ గోదావరి వరదను ఆపండయ్యా’.. BRS, కాంగ్రెస్ పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-13 06:47:32  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గోదావరి వరద నీరు వృధాగా పోతుండటంతో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఆ గోదావరి వరదను ఆపండయ్యా’.. BRS, కాంగ్రెస్ పై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గోదావరి వరద నీరు వృధాగా పోతుండటంతో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రోజుకు 50, 60 టీఎంసీలు గోదావరి వరద నీరు సముద్రం లోకి వెళ్తుంటే తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రశ్నించారు. ఈ క్రమంలో ‘‘బీఆర్ఎస్ నాయకులైనా బిందెలు అడ్డం పెట్టొచ్చు కదా.. కనీసం కాంగ్రెసోళ్లు చెంబులతో అయినా ఆపండయ్యా. రోజుకు 50, 60 టీఎంసీలు సముద్రంలోకి పోతుంటే ఏం చేస్తున్నారు మీరు’’ అంటూ ఆయన సెటైరికల్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బనకచర్ల ప్రాజెక్టు వివాదం చర్చనీయాంశం అవుతోన్నవిషయం తెలిసిందే. వృధాగా పోయే సుమారు 200 టీఎంసీల గోదావరి వరద నీటిని వినియోగించుకోని రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించాలని ఏపీ(Andhra Pradesh)లోని కూటమి ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)ను ప్లాన్‌ చేసింది. కానీ, బనకచర్ల ప్రాజెక్టు అమలైతే తెలంగాణ(Telangana) రాష్ట్రానికి చెందిన గోదావరి నీటి వాటా తగ్గిపోతుందని తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోంది. అయితే.. బనకచర్ల ప్రాజెక్టు వివాదం కొనసాగుతోన్న నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

ట్వీట్

Next Story