పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చూసి రివ్యూ ఇచ్చిన TDP ఎమ్మెల్యే మనవడు

by Gantepaka Srikanth |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది.

పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ చూసి రివ్యూ ఇచ్చిన TDP ఎమ్మెల్యే మనవడు
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు చిత్రం(Harihara Veeramallu Movie) జులై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రూపొందించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో నిధి అగర్వాల్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. తాజాగా హరిహర వీరమల్లు చిత్రాన్ని మనవడితో కలిసి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి(Somireddy Chandra Mohan Reddy) చూశారు. అనంతరం ఆయన మనవడు రివ్యూ ఇచ్చారు. ‘సినిమా చాలా బాగుంది. పవన్ కల్యాణ్ యాక్టింగ్ సూపర్. విలన్లను ఇరగ్గొట్టి అమాయకులకు హెల్ప్ చేయడం చాలా నచ్చింది’ అని మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలతో కలిపి కేవలం రూ.70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. కలెక్షన్లపై చిత్రబృందం అధికారిక చేయలేదు.

Next Story