మహానాడు పేరుతో డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యే అనుచరుడు సస్పెండ్

by Ajay Maddhiboyina |

ఏపీలో ఇటీవ‌ల మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని టీడీపీ ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ కార్య‌క్ర‌మం పేరుతో టీడీపీ ఎమ్మెల్యే మాధ‌వీ రెడ్డి పేరు చెప్పి ఆమె అనుచ‌రుడు తిరుమ‌లేశ్ డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

మహానాడు పేరుతో డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యే అనుచరుడు సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇటీవ‌ల మ‌హానాడు కార్య‌క్ర‌మాన్ని టీడీపీ ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ కార్య‌క్ర‌మం పేరుతో టీడీపీ ఎమ్మెల్యే మాధ‌వీ రెడ్డి పేరు చెప్పి ఆమె అనుచ‌రుడు తిరుమ‌లేశ్ డ‌బ్బులు వ‌సూలు చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. టీడీపీ మంత్రి నారాయ‌ణ‌కు చెందిన నారాయ‌ణ విద్యాసంస్థ‌ల వ‌ద్ద కూడా తిరుమ‌లేశ్ డ‌బ్బులు వ‌సూలు చేసేందుకు య‌త్నించాడు. దీంతో మంత్రి నారాయ‌ణ ఈ విష‌యాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాడు. తిరుమ‌లేష్ ను పార్టీ స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించింది. అధిష్టానం నుండి స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశాలు రావ‌డంతో ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి ముందుగానే అత‌డితో రాజీనామా చేయించిన‌ట్టు తెలుస్తోంది.

Next Story