- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP LAWCET : లాసెట్‌లో మెరిసిన ఎమ్మెల్యే
నందిగామ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య(TDP MLA Sowmya) ఏపీ లాసెట్‌లో(AP LAWCET-2025) మంచి ర్యాంక్ సాధించారు.

దిశ, వెబ్ డెస్క్ : నందిగామ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య(TDP MLA Sowmya) ఏపీ లాసెట్‌లో(AP LAWCET-2025) మంచి ర్యాంక్ సాధించారు. ఇటీవల నిర్వహించిన ఏపీ లాసెట్‌లో 120 మార్కులకు గాను 95 మార్కులు సాధించి, 739వ ర్యాంకు పొందారు. ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తూనే తన తండ్రి, దివంగత నేత తంగిరాల ప్రభాకర రావు ఆశయాలను కొనసాగించే లక్ష్యంతో న్యాయవాద వృత్తిని ఎంచుకోవాలనే ఆకాంక్షతో ఈ పరీక్ష రాశానని సౌమ్య మీడియాకు తెలిపారు. కాగా ఎమ్మెల్యే బీటెక్ పూర్తి చేసి గతంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కూడా పనిచేశారు.
కానీ తండ్రి ఆకస్మిక మరణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. పాలనలో చట్టాలపై అవగాహన ఉంటే ఎమ్మెల్యేగా తన విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి తోడ్పడుతుందని సౌమ్య అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే విజయాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాధవ రెడ్డి అభినందించారు. ఆమె తండ్రి ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారని ప్రశంసించారు.






