- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌కు శవరాజకీయాలు ఇష్టం.. ఆయన మర్చంట్ ఆఫ్ డెత్: ఎమ్మెల్యే సోమిరెడ్డి
జగన్ మోహన్ రెడ్డికి శవరాజకీయాలు అంటే ఇష్టం అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డికి విధ్వంసం అంటే ఇష్టం అని వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: జగన్ మోహన్ రెడ్డికి శవరాజకీయాలు అంటే ఇష్టం అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డికి విధ్వంసం అంటే ఇష్టం అని వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ కారు డిక్కీలో శవం వేసుకుని వస్తే జగన్ బుజం తట్టాడని ఆరోపించారు. ఆయన ర్యాలీలో చనిపోయినవాళ్లను కేవలం పరామర్శించలేదని విమర్శించారు. కానీ వేరే పార్టీ నాయకులను బూతులు తిట్టినా, తల్లి దండ్రులను అగౌరవపరిచినా వాళ్ల ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారని అన్నారు.
జగన్ ను మర్చంట్ ఆఫ్ డెత్ అంటూ సోమిరెడ్డి అభివర్ణించారు. ఈ రాష్ట్రంలో శవరాజకీయాలు చేసే ప్రాంతీయపార్టీ వైసీపీ అంటూ విమర్శించారు. ఇదిలా ఉంటే ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును బూతులు తిట్టారు. దీంతో అంబటి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయగా జగన్ వెళ్లి పరామర్శించారు. అయితే జగన్ పర్యటనలో ఇద్దరు మరణించినప్పటికీ వారి ఇంటికి వెళ్లి పరామర్శించలేదు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకులు ఆయనపై విమర్శలు చేస్తున్నారు.






