కాక రేపిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు

by Thanuru Gopichand |

కాక రేపిన టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : తిరువురులో జరిగిన ప్రజాదర్బార్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రావు (Kolikapudi Srinivasa Rao) వర్సెస్ పోలీసులు అన్నట్లుగా సాగడంతో వాతావరణం వేడెక్కింది. ప్రజాదర్బార్ (Praja Darbar) కు తిరువురు సీఐ హాజరు కాకపోవడంతో ఎమ్మెల్యే పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఐ ఎక్కడ, ప్రజా దర్బార్ కు ఎందుకు రాలేదని ఎస్ఐను కొలికపూడి ప్రశ్నించారు. అందుకు బదులుగా ఎస్ఐ మాట్లాడుతూ సీఐ నూజివీడు కోర్టుకు వెళ్లారన్నారు. దీంతో అసనానికి గురైన ఎమ్మెల్యే కోర్టుకు వెళ్లడం అంత ముఖ్యమా. అసలు వెళ్లినట్లు ఆధారాలు ఏమున్నాయని ప్రశ్నించారు. దీంతో పోలీసులు, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్రజాదర్బార్ నిర్వహణ విషయంలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఇటీవల సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే కొలికపూడి శ్రీనివాస్ రావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరువురు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కాగా పోలీసులు హాజరు కాకపోవడంపై కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐలు, ఎస్ఐలు రాకపోవడంలో కాసేపు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. దీంతో ఇతర అధికారులు అవాక్ అయ్యారు. విషయం తెలుసుకొని ఎస్ఐ సత్యనారాయణ (SI Satyanarayana) ప్రజాదర్బార్ కు హాజరయ్యారు. ఎస్ఐ పై ఎమ్మెల్యే ప్రశ్నల వర్షం కురిపించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి రసాభాసగా మారింది.

Next Story