- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ.. ఉద్రిక్తత
టీడీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది....

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ(Tdp) ఎమ్మెల్యేకు నిరసన సెగ తగిలింది. దీంతో స్థానికంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి(Kavali MLA Kavya Krishna Reddy)ని మాలేపాటి వర్గీయులు అడ్డుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు(Malepati Subbanaidu) ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా మరణించారు. ఈ రోజు సుబ్బానాయుడు కర్మ క్రతువులు జరిగాయి. ఈ కార్యక్రమానికి వెళ్లిన కావ్య కృష్ణారెడ్డిని మాలేపాటి వర్గీయులు అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సుబ్బానాయుడిని కావ్యకృష్ణారెడ్డి ఇబ్బంది పెట్టారని ఆందోళనకు దిగారు. కావ్యకృష్ణారెడ్డి గోబ్యాక్ అంటూ అంటూ నినాదాలు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సమక్ష్యంలో కావ్యకృష్ణారెడ్డిని అడుకోవడంతో ఆయన అక్కడి నుంచి వెను తిరిగి వెళ్లిపోయారు. దీంతో మాలేపాటి వర్గీయులు శాంతించారు






