- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే విజయచంద్ర బూతులు.. పోలీసులకు ఫిర్యాదు
పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీరు వివాదాస్పదంగా మారింది...

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర(TDP MLA MLA Bonela Vijayachandra) తీరు వివాదాస్పదంగా మారింది. పార్వతీపురం ఎమ్మార్వో విజయలక్ష్మి(MRO Vijayalakshmi)కి ఆయన రాత్రి సమయంలో ఫోన్ చేశారు. అంతేకాదు ఆమెను అసభ్యపదజాలంతో దూషించారు. ఓ భూమి విషయమై ఆయన మామూలు కాల్ చేశారు. అయితే మహిళా ఎమ్మర్వో ఫోన్ లిప్ట్ చేయలేదు. దీంతో ఆయన వాట్సాప్ కాల్ చేశారు. ఫోన్ లిప్ట్ చేయడంతో బూతులు తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ వాట్సాప్ కాల్ వైరల్ అయింది. ఈ మేరకు స్థానిక పోలీసులకు ఎమ్మార్వో ఫిర్యాదు చేశారు. తనను బూతులు తిట్టిన విజయచంద్రపై కేసు నమోదు చేయాలని కోరారు.
అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే స్పందించారు. ఎమ్మార్వో కార్యాలయం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. ఎమ్మార్వో మానసిక పరిస్థితి బాగోలేదని, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.






