- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు రోజులపాటు మహానాడు.. ఆరు కమిటీలకు బాధ్యతలు
కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడును (TDP Mahanadu) నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో (TDP Polit Bureau) సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో (Mangalagiri TDP Office) మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు.

- 27, 28, 29 తేదీల్లో నిర్వహణకు నిర్ణయం
- ఆరు కమిటీలకు బాధ్యతలు
- మహానాడు ఏర్పాట్లపై లోకేష్ దీర్ఘ చర్చ
- కడపలో మహానాడుపై నేతలకు దిశానిర్దేశం
దిశ, ఏపీ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కడపలో పండుగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ మహానాడును (TDP Mahanadu) నిర్వహిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో (TDP Polit Bureau) సమావేశానికి ముందు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో (Mangalagiri TDP Office) మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలవురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పండుగ వాతావరణంలో మహానాడును నిర్వహించడం జరుగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మహానాడును నిర్వహించాం. గత ప్రభుత్వంలో మహానాడుకు అడుగడుగునా ఇబ్బందులు పెట్టారు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారు. పార్టీ ఆవిర్భావం తర్వాత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుగులేని మెజార్టీ సాధించాం. వసతి, రవాణకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా నేతలకు దిశానిర్దేశం చేశారు. మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలు, కార్యాచరణపై చర్చించనున్నారు. రెండో రోజు రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన తీర్మానాలపై చర్చ జరగనుంది. మూడో రోజు బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్లమెంట్ మహానాడు, నియోజకవర్గ మహానాడు నిర్వహణపైనా సమావేశంలో చర్చించారు.
మూడు రోజుల పాటు మహానాడు..
మొత్తం మూడు రోజులపాటు మహానాడు (Mini Mahanadu) నిర్వహించాలని నిర్ణయించారు. 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. 27 వ తేదీన పార్టీ నిర్మాణం, సంస్థాగత అంశాలపై చర్చిస్తారు. 28 న ప్రభుత్వం సాధించిన విజయాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు పై చర్చ నిర్వహిస్తారు. 27, 28 తేదీల్లో ప్రతినిధుల సభ, 29 న భారీ బహిరంగ సభ జరుపుతారు. మహానాడు నిర్వహణకు మొత్తం 6 కమిటీ లను లోకేష్ నియమించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎస్.సవిత, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు సీనియర్ నేతలు బీద రవిచంద్ర యాదవ్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దామచర్ల సత్య, రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, వీరంకి వెంకట గురుమూర్తి, మంతెన రామరాజు, సి.భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యేల జ్యోతుల నెహ్రూ, ఆర్.మాధవి రెడ్డి, జీవీ ఆంజనేయులు, మంతెన సత్యనారాయణ రాజు, చింతకాయల విజయ్ తదితరులు పాల్గొన్నారు.






