నెల్లూరులో టీడీపీ మహానాడు రద్దు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-15 14:36:04  IST  )

టీడీపీ మహానాడుపై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పొదుపు పాటించాలని కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పొదుపు చర్యలు పాటిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్షంగా కాకుండా ఆన్ లైన్‌లో మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు....

నెల్లూరులో టీడీపీ మహానాడు రద్దు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ మహానాడు(Tdp Mahanadu)పై పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ పొదుపు పాటించాలని కేంద్రప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పొదుపు చర్యలు పాటిస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యక్షంగా కాకుండా ఆన్ లైన్‌లో మహానాడు నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) నిర్ణయించారు. అయితే ఈసారి టీడీపీ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు 27,28,29 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో చేపట్టాలని అనుకున్నారు. అయితే మనసు మార్చుకుని నెల్లూరు జిల్లా(Nellore District)లో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్కడి ప్రజాప్రతినిధులకు మహానాడు నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ఈ మేరకు పనులు వేగంగా చేపడుతున్నారు.

ఈసారి ఆన్ లైన్‌లో...

అయితే పెట్రోల్ పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ మహానాడును ఈసారి ఆన్ లైన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 27, 28న మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహించనున్నారు.ఎన్టీఆర్ భవన్ లో స్టేజ్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీ వ్యాప్తంగా 1845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనన్నారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి.


Next Story