- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AP:ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో టీడీపీ నేతల భేటీ
by Jakkula.Mamatha |
ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది.

X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో నూతనంగా ఏర్పడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి మంత్రులు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే నేడు (సోమవారం) మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు ప్రధానంగా ఇటీవల బడ్జెట్‌లో ఏపీలో వెనుకబడిన జిల్లాలకు కేటాయించిన నిధుల పై చర్చించారు. అలాగే అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం రూ.15వేల కోట్ల పైన చర్చలు జరిపారు. గత ప్రభుత్వం వైసీపీ హయాంలో రుణాల పునర్వవస్థీకరణ అంశంపై మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధికై ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.
Next Story






