అంబటి ఓర్వలేకపోతున్నారు.. టీడీపీ నేత స్ట్రాంగ్ కౌంటర్

by Vemula.Srinu Prasad |

అమరావతి అభివృద్ధిని ఓర్వేలేకపోతున్నారని మాజీ మంత్రి అంబటిపై టీడీపీ నేత మన్నవ మోహనకృష్ణ అన్నారు...

అంబటి ఓర్వలేకపోతున్నారు.. టీడీపీ నేత స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amavarati) అభివృద్ధిని ఓర్వేలేకపోతున్నారని, అందుకే మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ(TDP State Executive Secretary Mannava Mohanakrishna) అన్నారు. రాజధానిపై అంబటి చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోడీ(Pm Modi), సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu Naidu)నేతృత్వంలో ప్రజా రాజధాని అద్భుతంగా నిర్మాణం జరుగుతోందన్నారు. గ్రాఫిక్స్ అంటూ గతంలోనూ విష ప్రచారం చేశారని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించారని, అందుకే అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. అమరావతి కోసం రూ. 54 వేల కోట్లతో పనులు ప్రారంభిస్తే అంబటికి కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. కుట్రలెన్ని చేసిన అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోలేరని టీడీపీ నేత మన్నవ మోహన కృష్ణ దీమా వ్యక్తం చేశారు.

Next Story