రోజులు దగ్గర పడ్డాయ్.. ఆ ఫలితాలే నిదర్శనం: Kanna Laxminarayana

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-29 15:41:48  IST  )

సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాక్షస క్రీడ ఆడుతున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

రోజులు దగ్గర పడ్డాయ్.. ఆ ఫలితాలే నిదర్శనం: Kanna Laxminarayana
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాక్షస క్రీడ ఆడుతున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టీడీపీ 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏపీని జగన్ సర్కార్ దోచుకుంటోందని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని విమర్శించారు. ఇందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనమన్నారు. సంక్షేమమంటే మొదట గుర్తొచ్చేది ఎన్టీఆర్ పరిపాలనేనని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

కాగా ఇటీవల కాలంలో కన్నాలక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన దూకుడు పెంచారు. జగన్ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపిస్తు్న్నారు. తాజాగా టీడీపీ ఆవిర్భావ సభ వేదికగా ఏపీలో జరుగుతున్న అధికార కక్ష సాధింపులపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read..

ఏపీలో విధ్వంసం సృష్టించడానికే జగన్ పుట్టారు: సీఎంపై చంద్రబాబు ఫైర్

Next Story