ప్రజలే ఛీ కొట్టినా ఇంకా మాట్లాడుతున్నావ్: జగన్‌పై బుద్ధా వెంకన్న ఫైర్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-09 09:51:00  IST  )

జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు ఛీ కొట్టారని టిడిపి నేత బుద్దా వెంకన్న విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకునేందుకు వైసీపీ నేతలతో ఓ ఛానల్‌పై దాడులు చేయించారని ఆయన మండిపడ్డారు...

ప్రజలే ఛీ కొట్టినా ఇంకా మాట్లాడుతున్నావ్: జగన్‌పై బుద్ధా వెంకన్న ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు ఛీ కొట్టారని టిడిపి నేత బుద్దా వెంకన్న విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకునేందుకు వైసీపీ నేతలతో ఓ ఛానల్‌పై దాడులు చేయించారని ఆయన మండిపడ్డారు. విజయమ్మ లేఖ రాస్తే తమ పత్రికలో రాశావా అని ప్రశ్నించారు. అమరావతి మహిళలు వేశ్యలు అంటే... తమ సాక్షిలో రాశారని మండిపడ్డారు. భారతీరెడ్డి వాళ్లకు క్షమాపణలు ఎందుకు చెప్పలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది తమరు కాదా అని నిలదీశారు. సొంత చెల్లినే తిట్టించిన తమరు మహిళల హక్కులపై మాట్లాడుతున్నారా అని వ్యాఖ్యానించారు. జగన్ మావిగన్ ట్రోల్స్ కాకుండా ఉండదుకే ఓ ఛానల్ అధినేతపై బురద జల్లుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ చెప్పినట్లు రాయని చానల్స్, పత్రికల‌ను బెదిరిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

‘‘తమ పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా‌ చూపిస్తావా...?. గతంలో రాంగోపాల్ వర్మ తో నువ్వు సినిమాలు తీయిస్తే ప్రజలే ఛీ కొట్టారు. లోకేష్ బాబు తన పాదయాత్ర ద్వారా నీకు ఇప్పటికే సినిమా‌ చూపించాడుగా. చంద్రబాబు వరకు అక్కర్లేదు... లోకేష్ బాబుకే ట్రైలర్ చూపించ లేవు. గత ఐదేళ్ళ పాలనలో వేల కోట్లు దోచుకుంది మీరు ఒక్క అవినీతి గురించి అయినా సాక్షిలో రాశావా..?. చంద్రబాబు, లోకేష్‌లకు నీలాగా పత్రికలు లేవు. అమరావతి మహిళలను‌ నీచంగా మాట్లాడింది మీ‌ వైసిపి నేతలు కాదా. ఏనాడైనా తప్పు గా మాట్లాడాం అని మీరు క్షమాపణ చెప్పారా. నీకే సినిమా అయిపోయింది... వచ్చే ఎన్నికలలో ప్రజలే నిన్ను తరమి కొడతారు. అసలు మళ్లీ జగన్ అధికారం లోకి వస్తాడా... పగటి కలలు గంటున్నాడు. పాదయాత్ర కాదు..‌మోకాళ్ల యాత్ర చేసినా జగన్‌ను ప్రజలు నమ్మరు.’’ అని బుద్ధా వెంకన్న విమర్శించారు.

Next Story