- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ అర్జునుడు కాదు.. భస్మాసురుడు: అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్
చంద్రబాబుపై సీఎం జగన్ దెందులూరు వైసీపీ సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ..

దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుపై సీఎం జగన్ దెందులూరు వైసీపీ సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల హామీలన్నీ అబద్ధాలేనని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. అసలు దెందులూరు సభలో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనని చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. జగన్ పాలనలో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసి తమపై నిందితులు వేయడమేంటని ప్రశ్నించారు. ఈ 57 నెలల్లో రాష్ట్రంలో పన్నులు, చార్జీల మోతే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. వీటి పెంపుతో ప్రతి కుటుంబంపై రూ. 8 లక్షల భారం పడుతోందని చెప్పారు. జగన్ అబద్ధాల పునాదులపై పాలన సాగిస్తున్నారని విమర్శించారు. జగన్ అర్జునుడు కాదు.. భస్మాసురుడు అని కౌంటర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందే జగన్ ఓటమిని ఒప్పుకున్నారని ఎద్దేవా చేశారు. 3 రాజధానుల పేరుతో ప్రజా రాజధాని అమరావతని చంపేశారని మండిపడ్డారు. తల్లి, చెల్లిని పార్టీ నుంచి తరిమేసిన జగన్ మహిళా పక్షపాతి ఎలా అవుతారని ప్రశ్నించారు.






