- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీడీపీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ఖరారు.. కీలక వ్యక్తిని ప్రకటించిన అధిష్టానం
టీడీపీ జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ఖరారు అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ(Tdp) జీవీఎంసీ(Gvmc) మేయర్ అభ్యర్థి ఖరారు అయ్యారు. పీలా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థిగా(Peela Srinivasa Rao mayor candidate) పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఆయనకు సీనియర్ నేత గండి బాబ్జీ(Gandi Babji) బీఫామ్ అందజేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మేయర్‌ను ఎన్నుకోనున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీఎంసీపై ఫోకస్ పెట్టింది. వైసీపీ కార్పొరేటర్ గొలగాని హరి వెంకట కుమారి మేయర్‌గా అవిశ్వాసంలో పదవిని కోల్పోయారు. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ, జనసేన(Janasena)లోకి చేరిపోవడం, మెజార్టీ సభ్యులు ఆమెపై అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం, ఈ నెల 19న ఓటింగ్ జరగడం, అవిశ్వాసం నెగ్గడం చకాచకా జరిగిపోయాయి.దీంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావును ప్రకటించారు. సోమవారం ఉదయం జీవీఎంసీ కార్పొరేషన్ కౌన్సిల్‌లో మేయర్‌ను సభ్యులు ఎన్నుకోనున్నారు.






