త్వరలో మంత్రివర్గ విస్తరణ.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ

by Ajay Maddhiboyina |

ఏపీలో ఆగస్టు 6వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 8 మంది మంత్రులను తొలగిస్తారని, హోంమంత్రి అనితతో సహా పలువురి నేతల పేర్లు ప్రచారం జరుగుతున్నాయి.

త్వరలో మంత్రివర్గ విస్తరణ.. క్లారిటీ ఇచ్చిన టీడీపీ
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీలో ఆగస్టు 6వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 8 మంది మంత్రులను తొలగిస్తారని, హోంమంత్రి అనితతో సహా పలువురి నేతల పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. కాగా ఈ వార్తలపై టీడీపీ సోషల్ మీడియా వేధికగా స్పందించింది. కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేస్తుందని ఊహాగానాలు, అభూత కల్పనలతో రాసిన కథనాలు పూర్తిగా అబద్ధం అని పేర్కొంది. సుపరిపాలనలో తొలి అడుగు తొలి ఏడాది పూర్తయిన శుభ సందర్బంలో ఇలాంటి తప్పుడు కథనాలతో తప్పుదారి పట్టించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రులంతా పూర్తి స‌మ‌న్వ‌యంతో క‌లిసి పనిచేస్తున్నార‌ని తెలిపింది. టీడీపీ ప్ర‌క‌ట‌న‌తో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉండ‌దు అని క్లారిటీ వ‌చ్చేసింది.

Next Story