- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిద్దలూరులో విషాదం.. మాజీ టీడీజీ ఎమ్మెల్యే కన్నుమూత
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా రామభూపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి(89) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా రామభూపాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ కు తరలించారు. కాగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శుక్రవారం గిద్దలూరులో ఆయన అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1994లో టీడీపీ నుంచి రామభూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వగా ఆ తరవాత మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story






