- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇక వాళ్లు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవచ్చు: బాలకృష్ణ
పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించింది...

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల (Pulivendula ZPTC elections)ఫలితాల్లో టీడీపీ(Tdp) ప్రభంజనం సృష్టించింది. 30 ఏళ్లుగా ఉన్న ఏకగ్రీవాన్ని బద్దలుకొట్టింది. ఫలితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా(TDP candidate Mareddy Latha) అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 30 ఏళ్లుగా ఓట్లు వేసేందుకు ఎదురు చూస్తున్న ప్రజలకు ఈ ఎన్నికలు కొత్త ఉత్సాహాన్ని నిచ్చాయి. పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి ఓటు వేశారు. దీంతో టీడీపీకి భారీ విజయం దక్కగా వైసీపీ(Ycp)కి డిపాజిట్లు కూడా రాలేదు. దీంతో పులవెందుల మండలంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ విజయంపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎన్నికల విజయంపై హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. ఇక పులివెందుల ప్రజలు స్వేచ్ఛా వాయివులు పీల్చుకోవచ్చని తెలిపారు. 30 ఏళ్లుగా ఏకగ్రీవం అంటూ అప్రజస్వామ్యకంగా వ్యహరించారని ఆరోపించారు. ప్రజాస్వామ్యకంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని చెప్పారు. గతంలో నామినేషన్ వేసేందుకు సైతం నాయకులు భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో స్వేచ్ఛగా ఎన్నికల్లో నామినేషన్ వేశారని, ప్రజలు సైతం ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకున్నారని బాలకృష్ణ స్పష్టం చేశారు.






