ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే రాలేదని మనస్థాపం.. టీడీపీ కన్వీనర్ ఆత్మహత్యాయత్నం

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-03-11 09:19:08  IST  )

ఇఫ్తార్ విందు వేళ టీడీపీ కన్వీనర్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ...

ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే రాలేదని మనస్థాపం.. టీడీపీ కన్వీనర్ ఆత్మహత్యాయత్నం
X

దిశ, వెబ్ డెస్క్: ఇఫ్తార్ విందుల(Iftar Dinner) వేళ టీడీపీ కన్వీనర్(TDP Convener) ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. రంజాన్(Ramadan) సందర్భంగా అనంతపురం టీటీడీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. అయితే ఈ ఇఫ్తార్ విందుకు స్థానిక ఎమ్మెల్యే హాజరుకాలేదు. పట్టణంలో జరిగే విందుకు రావాలని ఎమ్మెల్యేకు టీడీపీ కన్వీనర్ నూర్ మహమ్మద్(TDP Convener Noor Mohammed) ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన కార్డును సైతం అందజేశారు. అయితే ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే రాలేదు. దీంతో విందు ఘనంగా జరగలేదని కన్వీనర్ మహమ్మద్ తోటి స్నేహితుల వద్ద చెప్పుకుని ఫీలయ్యారు. తద్వారా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పురుగుల మందు తాగారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన్ను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నూర్ మహమ్మద్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటన అనంతపురం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే రాకపోవడంపై చర్చ జరుగుతోంది.

Next Story