- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిఠాపురం పంచాయితీకి తెర.. వర్మకు కీలక పదవి
టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు ఆయనకు ఇవ్వడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని మాట ఇచ్చారు. పవన్ కల్యాణ్ తొలుత భీమవరంలో పోటీ చేస్తారని అనుకున్నామని, కానీ ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతామని చెప్పడంతో ఆ సీటు కేటాయించామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని, వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పిఠాపురం పంచాయితీ క్లియర్ అయిందని టీడీపీ, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read More..
విశాఖ ఉక్కును ఒక్క ఇంచు కూడా కదిలించలేరు: CM రేవంత్ కీలక వ్యాఖ్యలు






