అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మాణం

by Dishaweb |
అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే స్పీకర్ అందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి తమ నిరసన తెలిపారు. దీంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అంతేకాదు పలువురు టీడీపీ సభ్యులు స్పీకర్ చైర్ వద్దకు వెళ్లి తమ ఎజెండా కాపీలను చింపి నిరసన తెలిపారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సభ్యుల తీరుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సభను కోరారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. విలువైన సభా సమయాన్ని వృధా చేయడం సరికాదని హితవు పలికారు. ప్రజా సమస్యలపై చర్చిద్దామని పిలుపునిచ్చారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యంపై చర్చ జరపాలని.. స్వప్రయోజనాల కోసమా లేక రాష్ట్రప్రయోజనాల కోసమా పర్యటన అంటూ నిలదీశారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో 11 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సభ నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, నిమ్మకాయల చినరాజప్ప, బెందాళం అశోక్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, మంతెన రామరాజు, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, బాల వీరాంజనేయస్వామి , గద్దె రామ్మోహన్‌లు ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా ఐదవసారి కూడా టీడీపీ సభ్యులు సస్పెండ్‌కు గురవుతూనే ఉన్నారు.

Also Read...

దీనంతటికీ కారణం యువ ధిక్కారమేనా..?Next Story