Flash : టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెనుప్రమాదం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-19 09:20:28  IST  )

పెందుర్తి వద్ద టాటానగర్ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం తప్పింది. రైల్వే పనులు చేస్తుండగా.. విద్యుత్ స్తంభం ఒరిగి పక్కనే ఉన్న ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (OHE) విద్యుత్ వైర్లపై పడింది.

Flash : టాటానగర్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన పెనుప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: పెందుర్తి వద్ద టాటానగర్ ఎక్స్ ప్రెస్ కు పెనుప్రమాదం తప్పింది. రైల్వే పనులు చేస్తుండగా.. విద్యుత్ స్తంభం ఒరిగి పక్కనే ఉన్న ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (OHE) విద్యుత్ వైర్లపై పడింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు, మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు టాటానగర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వెళ్తుంది. ఉద్యోగులు గాయపడి పడిపోయి ఉండటం, విద్యువైర్లు నేలపై ఉండటం, స్తంభం ఒరిగిపోవడాన్ని గమనించిన లోకోపైలట్.. చాకచక్యంగా వ్యవహరించి రైలును నిలిపివేశాడు. దీంతో పెనుప్రమాదం తప్పింది. లోకోపైలట్ అప్రమత్తమవ్వకపోయి ఉంటే.. మరో ఘోర రైలు ప్రమాదం జరిగి వందలమంది ప్రాణాలు కోల్పోయేవారు. విద్యుత్ పోల్ పడి గాయపడిన వారిని రైల్వే సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

Next Story