Talliki Vandanam: ఒకే కుటుంబంలో 12 మంది పిల్లలకు తల్లికి వందనం.. ఒకేసారి రూ. 1.56 లక్షలు.. TDP

by Ramesh Naini |   (  Updated:2025-06-14 14:32:28  IST  )

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది.

Talliki Vandanam: ఒకే కుటుంబంలో 12 మంది పిల్లలకు తల్లికి వందనం.. ఒకేసారి రూ. 1.56 లక్షలు.. TDP
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Talliki Vandanam Scheme) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున జమ అవుతున్నాయి. కుటుంబంలో ఒకరికీ.. మరో కుటుంబంలో ఇద్దరికీ, ఇంకో ఇంట్లో ముగ్గురికి ఇలా ఎంత మంది ఉంటే అందరికీ డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా టీడీపీ (TDP) ఆసక్తికర పోస్ట్ చేసింది. ఉమ్మడి కుటుంబంలోని 12 మంది పిల్లలకు తల్లికి వందనం పడిందని తెలిపింది. అన్నమయ్య జిల్లా కలకడలో ఉమ్మడి కుటుంబంలో ఉన్న ముగ్గురు తల్లులకు, వారి 12 మంది పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయని వీడియో పోస్ట్ చేసింది. ఒకేసారి రూ.1.56 లక్షలు తమ అకౌంట్‌లో పడటంతో, ఆ కుటుంబం, ఆ తల్లుల సంతోషానికి అవధులు లేవని పేర్కొంది.

ఒక కుటుంబానికి రూ.78 వేలు

ఇదిలా ఉండగా కర్నూలు పరిధిలోని దేవనకొండకు చెందిన చాంద్‌బాషా, షకినాబి కుటుంబానికి ఆరుగురు కుమార్తెలు. అందరినీ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. తల్లికి వందనం పథకానికి వీరంతా అర్హత సాధించడంతో ఇప్పటివరకు రూ.78 వేలు ఖతాలో జమైనట్లు విద్యార్థుల తండ్రి చాంద్‌బాషా తెలిపారు. కాగా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ వర్తింపజేస్తోంది. జులై 30వ తేదీ లోపు అందరికీ తల్లికి వందనం డబ్బులు జమ చేసేలా ప్రణాళిక రూపొందించారు. అర్హులు, అనర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు.

Next Story