- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీ20 ప్రపంచకప్ ఫైనల్: స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ.. స్టేడియంలో మంత్రి నారా లోకేశ్ సందడి!
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తుది పోరు జరుగుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్-న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. భారత జట్టుకు మద్దతు తెలిపేందుకు ఆయన ప్రత్యేకంగా అహ్మదాబాద్ చేరుకున్నారు. ఇండియా టీమ్ జెర్సీ టీ షర్ట్ ధరించిన మంత్రి లోకేశ్ స్టైలిష్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చారు. స్టేడియంకు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు అభిమానులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కీలక పోరులో భారత్ విజయం సాధించి విశ్వవిజేతగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. స్టేడియంలోని గ్యాలరీ నుంచి మ్యాచ్‌ను తిలకిస్తూ టీమ్‌ఇండియా ఆటగాళ్లను ఆయన ఉత్సాహపరిచారు.
కివీస్ లక్ష్యం 256 పరుగులు
మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమ్‌ఇండియా బ్యాటింగ్ అధ్భుత ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కివీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 256 లక్ష్యాన్ని వారి ముందు పెట్టింది. లక్షలాది మంది అభిమానుల కేరింతలు, మరోవైపు ప్రముఖుల సందడితో నరేంద్ర మోడీ స్టేడియం విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. భారత్ ఈసారి కప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టిస్తుందని దేశవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






